Site icon Prime9

Daughter-in-law plotted murder: రూ.300 కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు

Nagpur murder

Nagpur murder

Daughter-in-law plotted murder: ఆస్తి కోసం మామను హత్య చేయించింది కోడలు. రూ.300 కోట్ల ఆస్తి దక్కించుకునేందుకు ఆమె రూ.1 కోటి సుపారి ఇచ్చి చంపింది. ఇక కోడలు విషయానికి వస్తే ఆమె సాదా సీదా మహిళ కూడా కాదు. టౌన్‌ ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది. దీనికి సంబంధించిన వివరాలివి..

నాగపూర్‌ టౌన్‌ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌లో ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌. తన మామకు సంబంధించిన 300 కోట్ల రూపాయాల ఆస్తిపై కన్నేసింది. ఆస్తిని చేజిక్కించుకునేందుకు ఆమె పక్కా స్కెచ్‌ వేశారు. కోటి రూపాయల సుపారి మాట్లాడుకుంది. తన మామ పురుషోత్తమ పుట్టేవార్‌ను అడ్డు తొలగించుకునేందుకు ఒక కిరాయి హంతక ముఠాతో మాట్లాడి వారి ఒక సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలుకు డబ్బు సర్దుబాటు చేసింది. పురుషోత్తమ్‌ను కారుతో గుద్ది చంపి .. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనేది కోడలు అర్చనా మనీష్‌ పుట్టేవార్‌ ప్లాన్‌. మామను అడ్డు తొలగించుకున్న తర్వాత రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకోవాలనే కోడలు ప్లాన్‌ అని పోలీసులు అధికారులు వివరించారు.

డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు..(Daughter-in-law plotted murder)

పోలీసు అధికారుల సమాచారం ప్రకారం కోడలు అర్చన మామను హత్య చేయడానికి కుట్ర పన్నారు. తన భర్త డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు నీరజ్‌ నిమ్జే, సచిన్‌ ధార్మిక్‌ను హత్య చేయడానికి మాట్లాడుకున్నారు. కాగా పోలీసులు వీరిద్దరిపై హత్యతో పాటు మోటార్‌ వెహికిల్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండు కార్లు, బంగారు నగలతో పాటు మొబైల్‌ ఫోన్లను జప్తు చేసుకున్నారు. పోలీసు విచారణలో ఈ సంఘటన జరిగిన రోజు 82 ఏళ్ల పురుషోత్తమ్‌ పుట్టేవార్‌ ఆస్పత్రిలో ఉన్న తన భార్య శకుంతలను చూడ్డానికి వెళ్లాడు. ప్రస్తుతం ఆమెకు సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కోడలు మాట్లాడుకున్న హంతక ముఠా ఆయన పై నుంచి కారుపోన్చి చంపేసింది. కాగా అర్చన భర్త విషయానికి వస్తే ఆయన డాక్టర్‌. కాగా నిందితులను అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయం భయపడింది. పక్షం రోజుల క్రితం జరిగిన సంఘటనత తర్వాత పోలీసులు అర్చనను అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా అర్చన విషయానికి వస్తే ఆమె టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఆమెకు ఉన్న రాజకీయ పలుకుబడితో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె లే ఔట్లను అనుమతిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబసభ్యులనే హత్య చేయించే స్థాయికి దిగజారిన మహిళను ఉపేక్షించరాదని .. ఆమెపై లోతుగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బారినపడిన బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Exit mobile version