Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని ఆనంద్ నగర్ కు చెందిన దుర్గారావు లక్ష్మీ దంపతులు రుణ యాప్ ద్వారా 50వేలు రుణం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 12:31 PM IST

East godavari: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని ఆనంద్ నగర్ కు చెందిన దుర్గారావు లక్ష్మీ దంపతులు రుణ యాప్ ద్వారా 50వేలు రుణం తీసుకున్నారు. అయితే ఆ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలైయ్యాయి. వెంటనే డబ్బులు చెల్లించకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి స్నేహితులకు, బంధువులకు పంపుతామని బెదిరింపులకు దిగారు లోన్ యాప్ నిర్వాహకులు. దీంతో మనస్థాపం చెందిన దుర్గారావు దంపతులు ఓ లాడ్జిలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన పై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇద్దరు చిన్నారులకు .5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగాపిల్లల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ఆదేశాలతో బాధిత కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించనున్నారు.