Brother killed Sister: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గాజ్యా నాయక్ తండా లో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా సొంత అక్కపై కక్షతో సొంత తమ్ముడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బస్సు దిగి వెడుతుండగా..(Brother killed Sister)
గజ్యా నాయక్ తండాకు చెందిన షేక్ రుక్సానా (40) ఈరోజు సుమారు రాత్రి 9:30 గంట ప్రాంతంలో మాచారెడ్డి ఎక్స్ రోడ్డుపై బస్సు దిగి గజ్యా నాయక్ తండాకు వెడుతుండగా వెనుక నుంచి సొంత తమ్ముడు యూసుఫ్ వెంబడించి చేతిలో రెండు కత్తులను పట్టుకొని అక్క తలపై దాడి చేసి నరికి చంపి వేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. గత కొద్ది రోజుల క్రితం తమ్ముడు ఓ ఆటో కొనుగోలు విషయంలో అక్క తమ్మునికి మధ్య గొడవ జరగడంతో స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో తమ్మునిపై అక్క ఫిర్యాదు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష గట్టి అక్కపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్, కామారెడ్డి రూరల్ సిఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. రుక్సానా మృతితో గ్రామంలో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.