BIG Twist In Meerpet Husband Cooker Murder Case: హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసిన మీర్‌పేట మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు తన భార్యను అతి కిరాతంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో హంతకుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత(45), తల్లి సుబ్బలక్ష్మమ్మ(62), సోదరుడు కిరణ్(32)లను నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
అయితే ఈ కేసులో నిందితుడు గురుమూర్తి మాత్రమే తన భార్య మాధవిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడు గురుమూర్తిపై హత్యకు సంబంధించిన పలు సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురిపై బీఎన్ఎస్‌లోని 85 సెక్షన్ గృహహింస ప్రయోగించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
ఇదిలా ఉండగా, గతంలో గురుమూర్తితో ఓ మహిళ కలిసి ఉండడాన్ని చూసిన తన భార్య గ్రామంలో పంచాయితీ పెట్టించింది. ఈ కారణంగా సొంతూరు వెళ్లేందుకు లేకుండా చేసిందని తన భార్య కక్ష్య పెట్టుకున్నాడు. అంతేకాకుండా పెద్దలను పిలిపించి తన కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చి పరువు తీసిందని కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారని తెలిసింది. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. నిందితులుగా గురుమూర్తి కుటుంబ సభ్యుల్లో ముగ్గురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.