Site icon Prime9

Bengaluru: డాక్టర్, ఇంజనీర్ అని చెప్పుకుంటూ 15 మంది మహిళలను పెళ్లిచేసుకున్న బెంగళూరు వ్యక్తి

Bengaluru

Bengaluru

Bengaluru:  15 మంది మహిళలను మోసగించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరులోని బనశంకరి నివాసి 35 ఏళ్ల మహేష్ కెబి నాయక్‌ను 2014 నుండి కనీసం 15 మంది మహిళలను వివాహం చేసుకుని తరువాత వారి నగదు మరియు నగలతో పారిపోయాడు. అతడిని మైసూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహిళ, ఈ ఏడాది ప్రారంభంలో నిందితుడిని వివాహం చేసుకున్న తరువాత ఫిర్యాదు చేయడంతో మహేష్‌ను అరెస్టు చేశారు. తప్పుడు వాస్తవాలు చెప్పి మోసగించాడంటూ మరో మహిళ కూడా పోలీసులను ఆశ్రయించింది.అతడి జాడ కోసం నగర పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేసి తుంకూర్ నుంచి రప్పించారు.మహేష్ ఒక ఆన్‌లైన్ సైట్‌లో మహిళలను ప్రలోభపెట్టడానికి నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్‌ను తయారు చేసాడు. ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఇంజనీర్, డాక్టర్‌గా పోజులిచ్చాడని పోలీసులు తెలిపారు.

భాషమీద అనుమానం వచ్చి..(Bengaluru)

తనను డాక్టర్‌గా చెప్పుకుంటూ మహేష్ తుమకూరులో నకిలీ క్లినిక్‌ని స్థాపించాడు. అంతేకాదు ప్రజలను నమ్మించడానికి ఒక నర్సును కూడా నియమించుకున్నాడు.
చాలా మంది మహిళలు అతని ఉచ్చులో పడగా, అతని పేలవమైన ఇంగ్లీష్ మాట్లాడే విధానం చూసి చాలామంది అనుమానించారు. అతని పేలవమైన భాషా నైపుణ్యాలతో పలువురు మహిళలు మహేష్ వివాహ ప్రతిపాదనను తిరస్కరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహేష్ 15 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. వారితో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతను తన భార్యలను చాలా అరుదుగా కలుసుకున్నాడు. అతను వివాహం చేసుకున్న చాలా మంది మహిళలు బాగా చదువుకున్న కారు కావడం విశేషం.
చాలా మంది బాధితులు తమను ఆ వ్యక్తి ద్వారా మోసగించబడ్డామని గ్రహించారు. అయితే దాని గురించి ఫిర్యాదు చేయలేదు

Exit mobile version