Site icon Prime9

Bihar Crime: దారుణం.. మార్కెట్లో అందరి ఎదుటా మహిళ చేతులు, చెవులు, రొమ్ములు నరికేసారు..

Bihar

Bihar

Bihar: బీహార్‌కు చెందిన నీలం దేవి ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌లా హత్యకు గురయ్యారు. షకీల్ అనే వ్యక్తి మరొకరితో కలిసి మహిళ చేతులు, చెవులు, రొమ్ములను నరికేశాడు. భాగల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన యువతిని మాయాగంజ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అధిక రక్తస్రావం కావడమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు. మహిళ తన మరణానికి ముందు తన హంతకుడి పేరును పోలీసులకు చెప్పిందని పేర్కొన్నారు.

రద్దీగా ఉండే మార్కెట్‌లో అందరి సమక్షంలోనే యువతిపై యువకుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. యువతికి పెళ్లయింది. ఆమె నిత్యం మార్కెట్‌కి వచ్చేది. యువతి శనివారం నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లింది. ఆ సమయంలో నిందితుడు ఆయుధాన్ని కంటైనర్‌లో దాచి మార్కెట్‌కు వచ్చాడుఅతని పేరు మహ్మద్ షకీల్. హత్యకేసులో ప్రధాన నిందితుడు షకీల్‌, అతనికి సహకరించిన మహ్మద్‌ జుద్దీన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చికెన్‌ చాపర్‌తో మహిళ అవయవాలను కోశారు. దీంతో పాటు నిందితుడి ఇంటి నుంచి పోలీసులు మరిన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి భర్త అశోక్ యాదవ్ కిరాణా దుకాణం నడుపుతున్నాడని తెలిపారు. అతని భార్య నీలం కూడా షాపులో కూర్చునేది. మహ్మద్ షకీల్ ఏ పని లేకుండా తన దుకాణానికి వచ్చేవాడు. మహిళ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

డబ్బుల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు నిందితుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నట్లు ఇప్పటివరకు విచారణలో తేలింది. నెల రోజుల క్రితం కూడా డబ్బు తిరిగి ఇచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై శనివారం నిందితులు మహిళపై పదునైన ఆయుధంతో దాడి చేశారు.

Exit mobile version