Atchampeta: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుంది. అచ్చంపేటకు చెందిన సింధు అనే వివాహిత మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధవులు సింధు మృతికి ఆమె భర్త నాగార్జున కారణమని భావించారు. నాగార్జునను బంధువులు ఆమనగల్ వద్ద ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారు.
వేధింపుల వల్లే..(Atchampeta)
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మూడేళ్ల కిందట సింధు, నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సింధు ఉరేసుకొగా., భర్త నాగార్జున కాపాడి నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్లు చికిత్స చేస్తుండగా సింధు మృతి చెందిదని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగా నాగార్జున కట్నంకోసం వేధిస్తున్నాడని తనతో చెప్పిందని సింధు తల్లి ఆరోపించారు.. అలాగే నాగార్జున కుటుంబసభ్యులు, అచ్చంపేటకు చెందిన డాక్టర్ కృష్ణ, ఆయన భార్య అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేశారని తెలిపింది. వీటన్నింటి వల్లే తన కూతురు ఆత్మహత్యకి పాల్పడిందని., నిందితులను కఠినంగా శిక్షించాలని సింధు తల్లి కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింధు, నాగార్జున మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.