Site icon Prime9

SI Suicide Attempt: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

SI Suicide Attempt

SI Suicide Attempt

SI Suicide Attempt:  అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన జాడ కనిపించలేదు. ఆదివారం రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న సమయంలో స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

అవినీతి ఆరోపణలు..(SI Suicide Attempt)

అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం ఉదయం స్టేషన్ లోని సిబ్బందితో మాట్లాడిన అనంతరం కారులో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎస్సై వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సీఐ జితేందర్రెడ్డి విచారణ చేపట్టారు. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించారు.ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్ఐ ఆచూకీ లభించక పోవడంతో సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్ఐపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పాటుగా స్టేషన్ లోని సిబ్బందికి, ఎస్ఐ మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లారు. బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఎస్సై ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version