Sensex: అక్టోబర్ మాస చివర రోజున షేర్ ట్రేడింగ్ మదుపరుల్లో సంతోషాన్ని నింపింది. బిఎస్ఈ సెన్సెక్స్ 786.74 పాయింట్లు లాభపడి 60,746-59 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.40 పాయింట్లు లాభపడి 18,012-20 వద్ద ముగిసింది. మరో దలాల్ స్ట్రీట్ లో కూడా సెన్సెక్స్ లాభాలను ఆర్జించింది. సోమవారం ప్రారంభం నుండే సెన్సెక్స్ ర్యాలీ కొనసాగింది. దాదాపుగా 1శాతం వృద్ధిని సాధించాయి.
లాభపడిన షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి, సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ మరియు బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్ ప్యాక్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
కూడా చదవండి: Hiranandani Group: యూపిలో 39వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిరానందానీ గ్రూపు