Site icon Prime9

Swiggy: ఐపీఎల్ సీజన్లో ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ గా నిలిచిందేంటో తెలుసా?

Swiggy

Swiggy

Swiggy: దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్‌ 2023 సీజన్ క్రికెట్‌ అభిమానులను ఎంటర్ టైన్ అలరించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజ‌రాత్ టైటన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్‌ పోరుతో ముగిసింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని సీఎస్కే టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఐపీఎల్ సందర్భంగా ప్రముఖ ఫుడ్ సరఫరా ప్లాట్ ఫామ్ స్విగ్గీ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బిర్యానీ ట్రోఫీని గెల్చుకుంది. ఈ సీజన్ లో ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ను బిర్యానీ గెలుచుకుంది అని స్వీగ్గీ ట్విట్‌ చేసింది.

 

యూజర్లు నెక్ట్స్ లెవల్(Swiggy)

ఐపీఎల్ సీజ‌న్‌ 2023 లో ఎన్ని బిర్యానీ ఆర్డర్లు వచ్చాయో స్విగ్గీ తాజాగా ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డ‌ర్లు వ‌చ్చాయిని ప్రకటించింది. ఎక్కువ మంది బిర్యానీనే ఆర్డర్ చేశారని, 12 మిలియన్లకు పైగా బిర్యానీ ఆర్డర్స్ వచ్చినట్టు పేర్కొంది. తొలి మ్యాచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు టోర్నీలో కేవలం క్రికెటర్సే కాదు స్విగ్గీ యూజర్లు కూడా నెక్ట్స్‌ లెవల్‌ అనిపించుకున్నారని తెలిపింది.

‘ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లు. ఇది కూడా కోల్‌కతాలో జరిగింది. ఈ క్రికెట్ సీజన్‌లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్‌లతో ఫుడ్ లీడర్‌ బోర్డ్‌లో బెంగుళూరు టాప్‌లో నిలిచింది. అదే విధంగా ఢిల్లీకి చెందిన ఒక కస్టమర్ ఈ సీజన్‌లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేశారు. అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ. 26,474’ అని స్విగ్గీ వెల్లడించింది.

 

 

ఫన్నీ ట్వీట్స్ తో

కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్‌ను బాగా క్యాష్‌ చేసుకున్న స్వీగ్గీ.. రకరకాల ట్వీట్స్ తో సందడి చేసింది. ట్విటర్ లో చిత్ర విచిత్ర కామెంట్లతో నెటిజన్లను ఆకర్షించింది. ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ కు వర్షం కారణంగా పదే పదే ఆటంకం ఏర్పడటంతో ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారంటూ ఫన్నీ ట్వీట్ చేసి సందడి చేసింది.

 

 

Exit mobile version