Swiggy Charges: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కొత్తగా ‘ప్లాట్ పామ్ ఫీజు’ వసూలు చేసేందుకు సిద్ధమైంది. కార్ట్ విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్ కు రూ. 2 ల చొప్పున ఈ ఫీజును విధించబోతోంది. అయితే ఈ ఫీజు కేవలం ఫుడ్ ఆర్డర్స్ పై మాత్రమే ఉండనుంది. ఈ కామర్స్, ఇన్ స్టా మార్ట కు ప్రస్తుతానికి ఈ ఛార్జీలు వర్తించవు.
ఇన్ స్టా మార్ట్ ఆర్డర్స్ పై(Swiggy Charges)
ఈ ఫ్లాట్ ఫామ్ చార్జీలను ప్రస్తుతానికి ఎంపిక చేసిన నగరాల్లోనే అమలు చేయనున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ లాంటి సిటీల్లోనే ఈ చార్జీలను వసూలు చేస్తున్నట్టు స్విగ్గీ తెలిపింది. అయితే ఈ చార్జీలు కేవలం సౌత్ సిటీల్లో నే ఉండనున్నట్టు తెలుస్తోంది. దేశ రాజధాని డిల్లీ , ముంబైలలో ఈ చార్జీలను ఇంకా ప్రవేశపెట్టలేదు. అయితే రానున్న రోజుల్లో ఇన్ స్టా మార్ట్ ఆర్డర్స్ పై కూడా ఈ ఫీజు వసూలు చేయనున్నారు. అయతే ఇన్ స్టా మార్ట్ ఆర్డర్స్ పై విధించే హ్యాండ్లింగ్ చార్జీలు భిన్నంగా ఉంటాయి.
భారీగా నిధి సమకూర్చుకునేందుకు
ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీలు తగ్గడం, దీర్ఘకాలంలో నగదు నిల్వలు కొనసాగించడానికి ఈ ఫీజు ఉపయోగపడుతుందని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫ్లాట్‌ఫామ్ ఫీజు అంటే ఏదైనా యాప్‌ను మనం వినియోగిస్తునందుకు.. ఆ ఫ్లాట్‌ఫామ్‌కు కట్టే ఫీజు. నిజానికి రూ. 2 అనేది చూడ్డానికి చిన్నమొత్తంగా కనిపించినా.. రోజుకు దాదాపు 15 లక్షల ఫుడ్ డెలివరీలు చేసే స్విగ్గీకి ఈ ఫీజు వల్ల భారీగానే నిధి సమకూరుతుందని మార్కెట్ నిపుణలు భావిస్తున్నారు.