Mumbai: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలతో పాటు, రిటైల్ ద్రవ్యోల్బణం, ఐటీ మేజర్ కంపెనీల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ పై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం సెన్సెక్స్ 305 పాయింట్లు నష్టపోయి 57320 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు నష్టంతో 17043 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేడు దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఐదు నెలల గరిష్ట స్థాయికి సెప్టెంబరు రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇదేకాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరింత వడ్డీరేట్ల పెంచడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ క్యూ 2 ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మదుపరులు స్టాక్స్ విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు.
ఇదీ చదవండి: పుంజుకున్న స్టాక్ మార్కెట్