Stock market: లాభాలతో ముగిసిన సూచీలు.. 18,700 పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ ట్రెండ్‌నే కొనసాగించాయి. రేపు ఆర్‌బీఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది.

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ ట్రెండ్‌నే కొనసాగించాయి. రేపు ఆర్‌బీఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్న క్రమంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. అదే విధంగా మే నెలలో చైనా ఎగుమతులు పడిపోయాయన్న వార్తల నేపథ్యంలో ఆసియా సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి.

 

ఉదయం సెన్సెక్స్‌ 62,917.39 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,196.43 నుంచి 62,841.95 మధ్య కదలాడింది. చివరకు 350.08 పాయింట్ల లాభంతో 63,142.96 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,665.60 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,738.95 నుంచి 18,636 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 127.40 పాయింట్లు లాభపడి 18,726.40 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసేటప్పటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై రూ. 82.54 దగ్గర నిలిచింది

 

ఏ షేర్లు లాభపడ్డాయంటే..(Stock market)

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన షేర్ల జాబితాలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌ లు ఉన్నాయి.