Site icon Prime9

Stock Markets: మూడో రోజూ లాభాలే.. 18,633 చేరువకు నిఫ్టీ

Stock Markets

Stock Markets

Stock Markets: దేశీ స్టాక్‌ మార్కెట్లు మూడో రోజు మంగళవారం కూడా లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా లాభ నష్టాల మధ్య కదిలాయి. ఆఖరి గంటన్నరలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో లాభాలతో స్థిరపడ్డాయి. ఉదయం సెన్సెక్స్‌ 62,839.85 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,036.12- 62,737.40 మధ్య కదలాడి.. చివరకు 122.75 పాయింట్ల లాభంతో 62,969.13 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,606.65 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,662.45- 18,575.50 మధ్య ట్రేడైంది. చివరకు 35.20 పాయింట్లు లాభపడి 18,633.85 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు పతనమై 82.71 దగ్గర నిలిచింది.

 

అత్యధికంగా నష్టపోయిన షేర్లలో(Stock Markets)

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ , ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌షేర్లు లాభాలు చూశాయి. అత్యధికంగా నష్టపోయిన షేర్లలో టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టైటన్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ షేర్లు ఉన్నాయి.

వచ్చే 25 ఏళ్ల పాటు ఆఫ్‌షోర్‌ విండ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులపై ఎలాంటి ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ చార్జీలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ షేరు విలువ 10.68 శాతం పెరిగి రూ. 1,589 దగ్గర ముగిసింది. ఐనాక్స్‌ విండ్‌ షేర్ విలువ 1 శాతం పెరిగి రూ. 135 వద్ద స్థిరపడింది.

జనవరి, మార్చి త్రైమాసికంలో వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 48.9 శాతం క్షీణించింది. ఆదాయం మాత్రం 2.7 శాతం వృద్ధి గా నమోదు అయింది. దీంతో కంపెనీ షేరు విలువ 0.64 శాతం నష్టపోయి రూ. 248. 25 దగ్గర ముగిసింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించిన రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు.. గత రెండు రోజుల్లో 25 శాతానికి పైగా పెరిగింది. ఈ రోజు కంపెనీ షేర్ విలువ 10.14 శాతం పెరిగి రూ. 256. 30 దగ్గర ముగిసింది.

 

Exit mobile version