Site icon Prime9

Stock markets: వరుసగా నాల్గవరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock markets

Stock markets

Stock markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదలైన డేటాను బట్టి చూస్తే.. ద్రవ్యోల్బణం కట్టడికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కొనసాగించడం ఖాయమనే వార్తలు ఇన్వెస్టర్లను కలవరానికి గురి చేశాయి.

నాలుగు రోజుల్లో 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..(Stock markets)

వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు, మరోపక్క ఆర్బీఐ భేటీ మినిట్స్ విడుదల ప్రభావంతో ఎన్‌ఎస్‌ఈ 272 పాయింట్లు మేర నష్టపోయి 17వేల554 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ దాదాపు 930 పాయింట్లు మేర పతనమయ్యి 59వేల744 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఫలితంగా కేవలం 4 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద 7 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

ఉక్రెయిన్ పరిణామాల ప్రభావం..

గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. వాల్‌స్ట్రీట్ లో ఈ ఏడాది అత్యధిక నష్టపోయింది నిన్ననే. ఎస్ అండ్ పీ 500 సూచీ 2 శాతం మేర పతనమైంది. డౌజోన్స్, నాస్‌డాక్ సూచీలది కూడా ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా అత్యంత కీలకమైన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం అంతర్జాతీయంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు ఆకస్మికంగా పర్యటించడం కూడా ఈ పరిస్థితులకు కారణమైంది.ఇక ఆర్బీఐ మినిట్స్ విడుదల కానుండడం, అదానీ స్టాక్స్ నష్టాలు కొనసాగడం, టెక్నికల్ అంశాలు, ఎఫ్ఐఐల భయాలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలుగా మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

బీఎస్‌ఈ లో అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, టాటామోటార్స్‌, విప్రో, ఎన్‌టీపీసీ షేర్లు దాదాపు మూడు శాతం వరకు నష్టపోయాయి. ఇక డాలర్‌ మారకంతో రూపాయి నాలుగు పైసలు క్షీణించి 82.83 వద్ద ఈ రోజు ఉదయం ట్రేడ్‌ అయ్యింది.

Exit mobile version