Stock Market: గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 62,601.97 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,719.84 నుంచి 62,379.86 మధ్య కదలాడింది. చివరకు 118. 57 పాయింట్ల లాభంతో 62, 547.11 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18, 550. 85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,573.70 నుంచి 18,478.40 మధ్య ట్రేడైంది. చివరకు 46.35 పాయింట్లు లాభపడి 18, 534.10 దగ్గర స్థిరపడింది.
మార్కెట్ల విశేషాలు( Stock Market)
సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, టైటన్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, టాటా స్టీల్, మారుతీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి.
2024 మార్చి 31 నాటికి అదనపు టైర్ 1, టైర్ 2 బాండ్ల ద్వారా రూ. 5 వేల కోట్లు సమీకరించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాంకు షేరు విలువ ఈరోజు దాదాపు 1 శాతం లాభపడి రూ.186. 60 దగ్గర స్థిరపడింది.
హోం రెంటల్ ప్లాట్‌ఫాం నెస్ట్ అవేను.. ఆరమ్ ప్రాప్ టెక్ రూ. 90 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ రోజు ఆరమ్ ప్రాప్‌టెక్ షేరు విలువ 7.91 శాతం పెరిగి రూ. 126.80 దగ్గర ముగిసింది.
మార్చి త్రైమాసిక ఫలితాల బలంగా ఉన్న కారణంగా గత మూడు రోజులుగా మ్యాన్‌కైండ్ ఫార్మా షేరు రాణిస్తోంది. ఈ వ్యవధిలో స్టాక్ 11 శాతానికి పైగా పెరిగింది. ఈ రోజు షేరు విలువ 4.99 శాతం పెరిగి రూ.1,465 దగ్గర స్థిరపడింది.