New Delhi: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మరియు జూన్ నెలలకు సంబంధించి జీఎస్టీ నష్టపరిహారంగా కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు రూ. 17,000 కోట్లు విడుదలచేసింది. అధికారిక వర్గాల ప్రకారం, రాష్ట్రాలు 2022–2023 సంవత్సరంలో రాష్ఠ్రాలు మొత్తం జీఎస్టీ పరిహారంగా రూ. 1,15,662 కోట్లు పొందాయి.
దీంతో కేంద్రం ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా అందాల్సిన మొత్తం సెస్ మొత్తాన్ని నష్టపరిహారం చెల్లింపు కోసం రాష్ట్రాలకు ముందుగానే విడుదల చేసిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.వనరుల నిర్వహణలో రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి మరియు ఆర్థిక సంవత్సరంలో వారి కార్యక్రమాలు, ముఖ్యంగా మూలధన వ్యయాలకు విజయవంతంగా నిధులు సమకూరుస్తాయనే హామీని ఇవ్వడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.