Site icon Prime9

Xiaomi Redmi A1 Plus: రెడ్ మీ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే..

red mi smart phone prime9news

red mi smart phone prime9news

Redmi A1 Plus Smart Phone: రెడ్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మన ముందుకు అతి త్వరలో వచ్చేస్తోంది. A సిరీస్‌లో రెడ్ మీ స్మార్ట్ ఫోన్‌ లాంచ్ చేయనున్నారు. రెడ్‌మీ A1+ స్మార్ట్ ఫోన్ ఈ వారంలో మన ముందుకు రానుంది. భారత మార్కెట్‌లో అక్టోబర్ 14వ తేదీన ఈ 4G ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు రెడ్‌మీ అధికారికంగా వెల్లడించింది. ఈ డిజైన్‌ను ప్రధానంగా హైలైట్ చేసింది. కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు కూడా రిలీజ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ రెడ్‌మీ A1+ స్మార్ట్ ఫోనును తీసుకొస్తోంది.

Redmi A1 Plus స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి..

గ్లోబల్‌గా లాంచ్ అయిన స్పెసిఫికేషన్లతో ఇండియాలోనూ రెడ్‌మీ ఏ1+ విడుదలవుతుందని మన అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ 5000mAh బ్యాటరీతో రానుంది. వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచుల HD+ డాట్ DISPLAY తో రెడ్‌మీ A1+ ఈ స్మార్ట్ ఫోన్ వస్తుందని అంచనా. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 OS తో మన ముందుకు అందుబాటులోకి వస్తుంది. 4G కనెక్టివిటీ ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,499గా ఉంది. 2GB ర్యామ్, 32GB స్టోరేజ్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది.

Exit mobile version