Site icon Prime9

Inflation effect: ద్రవ్యోల్బణం పెరుగుదల పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నవంబర్ 3న బెంగళూరులో మీటింగ్

RBI

RBI

Reserve Bank Of India: ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొనింది. నవంబర్ 3న మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) భేటిని బెంగళూరులో నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

గడిచిన మూడు త్రైమాసికాలాలలో ద్రవ్యోల్బణం 6శాతానికి దాటిపైకి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 6శాతం కన్నా తక్కువుగా ఉండాల్సిన ద్రవ్యోల్బణం విఫలం చెందడం పై నివేదికను రూపొందించనున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది.

ఆర్బీఐ చట్టంలోని (RBI Act) సెక్షన్ 45 జెడ్ఎన్ నిబంధన కింద అదనంగా ఎంపీసీ భేటీ నిర్వహించవచ్చునని, ఇందుకు అనుగుణంగానే నవంబర్ 3న ప్రత్యేక భేటీ నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలమైతే ప్రత్యేక ఎంపీసీ భేటీ నిర్వహించేందుకు సెక్షన్ 45జెడ్ఎన్ నిబంధన అవకాశం కల్పిస్తోంది.

ఇది కూడా చదవండి: Sale of Scrap: స్క్రాప్‌ అమ్మకాలతో రూ. 254 కోట్లు సంపాదించిన కేంద్రం

Exit mobile version