Site icon Prime9

Oppo A17 : ఒప్పో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !

oppo 17 prime9news

oppo 17 prime9news

Oppo A17 :  ప్రముఖ బ్రాండ్ ఒప్పో సంస్థ వారు A సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేశారు.ఒప్పో A17 మొబైల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చింది.ఈ స్మార్ట్ ఫోన్ లెదర్ డిజైన్, రెండు కలర్ ఆప్షన్‌లలో ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేశారు.మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌,50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఒప్పో A17 మన ముందుకు వస్తోంది.ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ,HD+ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్‌ స్పెసిఫికేషన్ల కింద చదివి తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ ఫోన్‌ స్పెసిఫికేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

6.56 ఇంచుల HD+ LCD డిస్‌ప్లేతో oppo A17 స్మార్ట్ ఫోన్ వస్తుంది.స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్, 89.8 శాతం బాడీ టూ స్క్రీన్ Ratio ఉంటుంది.మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్‌ రన్ అవుతుంది.ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఉపయోగించుకొని 8gb వరకు ర్యామ్‌ను పొడిగించుకునే ఫీచర్‌ను ఒప్పో మన ముందుకు తీసుఇచ్చింది.మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది.Oppo A17 ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. అవి ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, రెండోది 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్‌ ధర ఈ విధంగా ఉంది

4gb ర్యామ్ + 64gb స్టోరేజ్ ఉన్న oppo A17 ధర రూ.12,499గా ఉంది.మిడ్‌నైట్ బ్లాక్,సన్‌లైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది.

Exit mobile version