Mumbai: గురువారం కూడా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు నష్టాలు చవి చూశాయి. ఈ రోజు ప్లాట్ గా ప్రారంభించిన మార్కెట్లు రోజు మధ్యాహ్నం వరకు స్పల్ప లాభాలతో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్లు ముగిసే చివరి గంటన్నరలో పూర్తిలో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. అదే విధంగా గురువారం వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉండటం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది.
నిఫ్టీ 18,487 వద్ద(Mumbai)
ఉదయం సెన్సెక్స్ 62,736.47 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,762.41 నుంచి 62,359.14 మధ్య కదలాడింది. చివరకు 193.70 పాయింట్ల నష్టంతో 62,428.54 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,579.40 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,580.30 నుంచి 18,464.55 మధ్య ట్రేడైంది. చివరకు 46.65 పాయింట్లు నష్టపోయి 18,487.75 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 82.42 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన షేర్ల జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా ఉన్నాయి.