Mumbai: దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ కొన్న ప్రముఖ వ్యాపారవేత్త

సౌత్ ముంబైలోని మలబార్ హిల్స్ ఏరియాకు బాగా ఖరీదైన ప్రాంతంగా పేరుంది.

Mumbai: దేశ ఫైనాన్షియల్ రాజధాని ముంబై లో మామూలు అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ కొనాలంటే కనీసంలో రూ. కోటి రూపాయలు పెట్టాల్సిందే. అదే అన్నీ సదుపాయాలుండే లగ్జరీ ఇల్లు కొనాలంటే ఇంకెన్ని కోట్లు పెట్టాలి. తాజాగా ముంబై సిటీలో ఒక ఫ్లాట్ మైండ్ బ్లోయింగ్ ధరకు అమ్ముడుపోయింది. మరి అంత కాస్ట్ లీ ఫ్లాట్ ను కొన్నది ఎవరు? ఎన్ని కోట్లు పెట్టి ఆ లగ్జరీ ఇల్లు తీసుకున్నారో చూద్దాం.

లోధా గ్రూప్ కు చెందిన(Mumbai)

సౌత్ ముంబైలోని మలబార్ హిల్స్ ఏరియాకు బాగా ఖరీదైన ప్రాంతంగా పేరుంది. ఇక్కడ ఉన్న మూడు అంతస్థుల లగ్జరీ ప్లాట్ ను ప్రముఖ బిజినెస్ మెన్ , హెల్త్ కేర్ ప్రొడెక్ట్స్ కంపెనీ ఫామీ కేర్ ఫౌండర్ జేపీ తపారియా కుటుంబ సభ్యులు కొనగోలు చేశారు. ఈ ట్రిప్లెక్స్ ఫ్లాట్ ఖరీదు అక్షరాలా రూ. 369 కోట్లు. సముద్రపు ఫేసింగ్ ఉన్న ఈ ఇంటిని లోధా గ్రూప్ కు చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి ఖరీదు చేశారు.అయితే ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ గా ఈ ఇల్లు నిలిచింది.

ప్రీమియం లగ్జరీ టవర్స్ గా పేరొందిన లోధా మలబార్ ప్యాలెస్ లోని 26, 27,28 ఫ్లోర్స్ లో ఈ ట్రిప్లెక్స్ ఫ్లాట్ ఉంది. దాని ఏరియా మొత్తం 27వేల 160 S.Ft గా ఉంది. ఒక్కో చదరపు అడుగు రూ. 1.36 లక్షలు అన్నమాట. ఈ ఫ్లాట్ స్టాంప్ డ్యూటీ కోసమే తపారియా కుటుంబం రూ. 19.07 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. చదరుపు అడుగుల ఆధారంగా చూసుకుంటే ఈ ఫాట్ అత్యంత విలువైన రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ అని నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి.

 

( తపారియా కుటుంబం)

కాగా, గత నెలలో లోధా గ్రూప్ కే చెందిన ఖరీదైన మరో ఇంటిని బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ కూడా కొనుగోలు చేశారు. దాదాపు 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ట్రిప్లెక్స్ ఫ్లాట్ ను రూ. 252.5మ కోట్లకు నీరజ్ బజాజ్ కొన్నారు. ముంబై పైనాన్షియల్ రాజధాని కావడం, బీచ్ కు దగ్గరగా ఉండటం లాంటి కారణాలతో ఈ ఏరియాలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణలు చెబుతున్నారు.

అదే విధంగా నగరంలో మరో ఖరీదైన ప్రాంతంగా వర్లీ కి పేరుంది.ఇక్కడ వెల్ స్పన్ గ్రూఫ్ ఛైర్మన్ బీకే గోయెంకా రూ. 230 కోట్లతో ఓ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ ను తీసుకున్నారు. దాని ఖరీదు రూ. 230 కోట్లు. ఇదే అపార్ట్ మెంట్ గ్రూప్ లో రూ. 1238 కోట్లతో మొత్తం 28 ఫ్లాట్స్ ను కొనుగోలు చేశారు డీమార్ట్ ఓనర్ రాధాకిషన్ దమానీ.