Site icon Prime9

Anand Mahindra: మండే మోటివేషన్.. నెట్టింట వైరల్ గా మారిన మహింద్ర చీఫ్ పోస్ట్

Monday motivation posted by the Mahindra chief on social media has gone viral

Viral Post: నేటి సమాజంలో నెట్టింట వైరల్ అవుతున్న ఎన్నో విషయాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. సమాజంలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అలాంటి ప్రేరణలను షేర్ చేసే వ్యక్తుల్లో ఒకరు మహింద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్ర. ఆయన తాజాగా రామకృష్న పరమహంస యోగానంద్ చేసిన ఓ స్పూర్తిదాయక కొటేషన్ ను మండే మోటివేషన్ అనే వ్యాఖ్యంతో తనదైన శైలిలో ట్విటర్ లో పోస్టు చేశారు.

వారం ఆరంభంలో అందరిలో జోష్ నింపుతోంది. మీరు విచారంగా ఉండాల‌నుకుంటే ప్ర‌పంచంలో ఏ ఒక్క‌రూ మిమ్మ‌ల్ని సంతోష‌పెట్ట‌లేరు. కానీ మీరు మీ మ‌న‌సును సంతోషంతో నింపుకుంటే మీలోని ఆనందాన్ని ఈ ప్ర‌పంచంలో ఏ ఒక్క‌రూ దూరం చేయ‌లేర‌ని కోట్ అర్ధాన్ని పేర్కొన్నారు.

వారంలో తొలిరోజు చికాకుల‌ను పార‌దోలేందుకు శాశ్వ‌త ప‌రిష్కారం. మండే మోటివేష‌న్ అని ఈ పోస్ట్‌కు మహింద్ర అధినేత క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ పోస్ట్ ప‌లువురు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంది. స్ఫూర్తి నింపే పోస్ట్ ఇదేనంటూ ఓ యూజ‌ర్ రాసుకురాగా, అద్భుతం. స్ఫూర్తిదాయ‌క‌మైన వ్యాఖ్య అంటే ఇదేన‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్స్ సెక్ష‌న్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Culvert collapsed: కుప్పకూలిన కల్వర్టు.. క్షేమంగా బయటపడ్డ జనం.. యుపిలో ఘటన

 

Exit mobile version