Sensex: దూసుకెళ్లిన సూచీలు…నిఫ్టీ @ 18350

మదుపర్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ విలువ 3.6లక్షల కోట్లకు ఎగబాకింది. 52వారాల గరిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్ చేరుకున్నాయి.

Delhi: మదుపర్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ విలువ 3.6లక్షల కోట్లకు ఎగబాకింది. 52వారాల గరిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్ చేరుకున్నాయి. నేడు ప్రారంభమైన సమయం నుండి బుల్ ర్యాలీ నడిచింది. అదే దూకుడు ముగింపు వరకు సాగింది. చివరకు సెన్సెక్స్ 1,181.34 పాయింట్ల లాభంతో 61,795.04 వద్ద స్ధిరపడింది. నిఫ్టీ 321.50 పాయింట్లు పెరిగి 18,349.70 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసిఎస్ లు లాభపడ్డాయి. ఎస్బీఐ, కోటాక్ మహీంద్రా బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎన్పీటీసి లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారడం విలువ రూ. 80.75 వద్ద నిలిచింది.

నేటి మార్కెట్ ర్యాలీకి కొన్ని సంఘటనలు దోహదం చేశాయి. వరుసగా నాలుగో నెల కూడా అమెరికాలో ద్రవ్యోల్భణం తగ్గింది. అక్టోబరులో అంచనాల కంటే తక్కువగా 7.7 శాతం నమోదు కావడంతో ప్రపంచ మార్కెట్లో ఉత్సాహం నింపింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడర్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు విషయంలో నెమ్మదించొచ్చన్న విశ్లేషణలు ర్యాలీకి ఓ కారణంగా చెప్పాలి. దీని ప్రభావం గ్లోబల్ మార్కెట్ పై పడింది. దాదాపుగా అన్ని సూచీలు లాభాల దిశగా సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: