Site icon Prime9

Hisense Smart TV: హైసెన్స్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు ఇవే..

smart tv 2 prime9news

smart tv 2 prime9news

Hisense A7H Tornado 2.0 Smart TV: హైసెన్స్ సంస్థ నుంచి మార్కెట్‌లోకి మరో అదిరిపోయే స్మార్ట్ టీవీ మన ముందుకు వచ్చేసింది. ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచుల 4k LED display హైసెన్స్ A7H టోర్నడో 2.0 లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ టీవీ 102 వాట్ల sound output ఉండే JBL స్పీకర్లు ఈ టీవీకి హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే రన్ అవుతుంది. హైసెన్స్ A7H టోర్నడో 2.0 ధర, పూర్తి స్పెసిఫికేషన్లు వివరాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

హైసెన్స్ A7H టోర్నడో 2.0 స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి..
4K (3840×2160 pixels ) Resolution ఉన్న 55 ఇంచుల display హైసెన్స్ ఏ7హెచ్ టోర్నడో 2.0 స్మార్ట్ టీవీ మన ముందుకు రాబోతుంది. 178 డిగ్రీల wide viewing యాంగిల్స్ ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పిక్చర్ క్వాలిటీ, కలర్స్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యేలా డాల్బీ విజన్ ఫీచర్‌, HDR10+ సపోర్ట్‌ను ఈ టీవీ కలిగి ఉంది. గేమింగ్ కోసం ల్యాటెన్స్ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ టీవిలో ఉంటాయి.

Hisense A7H Tornado 2.0 ధర, సేల్‌..
హైసెన్స్ A7H టోర్నడో 2.0.. 55 ఇంచుల 4K స్మార్ట్ టీవీ ధర ప రూ.44,990గా ఉంది. మీరు ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవిని కొనుగోలు చేయవచ్చు. అతి త్వరలో 50 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్ కూడా అందుబాటులోకి రానుందని హైసెన్స్ సంస్థ వారు వెల్లడించారు.

Exit mobile version