Site icon Prime9

Thomson QLED Smart TV Series: థామ్సన్ సంస్థ వారు విడుదల చేసిన కొత్త టీవిల వివరాలు ఇవే!

thamson tv prime9news

thamson tv prime9news

Thomson QLED Smart TV Series: ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ QLED 4K స్మార్ట్ టీవీ సిరీస్ వారు కొత్తగా టీవీ సిరీస్ లను లాంచ్ చేశారు. ఈ టీవీ సిరీస్లు మొత్తం మూడు డిస్‌ప్లే వేరియంట్లగా ఉండబోతోందని, కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ టీవీలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని థామ్సన్ సంస్థ వారు తెలిపారు.

ఈ టీవీ సిరీస్లు 50ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచుల డిస్ప్లే వేరియంట్లలో థామ్సన్ QLED 4K స్మార్ట్ టీవీ సిరీస్ వచ్చింది. మూడు టీవీల్లో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఒకే విధంగా ఉన్నాయి. 4K రెజల్యూషన్ ఉండే QSED రానున్నాయి. డాల్బీ విజన్, HDR 10+, HDR 10, HGL టెక్నాలజీకి కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.

QLED Smart TVల్లో మీడియా టెక్ ప్రాసెసర్‌ కొత్తగా డిజైన్ చేశామని Thomson సంస్థ వారు వెల్లడించారు. 2GB, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఇవి రాబోతున్నాయి. ఇవి గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌ పైన మాత్రమే ఈ టీవీలు రన్ అవుతాయని, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోతో పాటు అన్ని ఓటీటీ అప్లికేషన్స్ కు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయని, మీరు అప్లికేషన్స్ ను డైరెక్టుగా ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అంతే కాకుండా గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఫీచర్లు దీనిలో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Thomson QLED Smart TV Series ధరలుచూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి..

థామ్సన్ QLED 4K స్మార్ట్ టీవీ సిరీస్‌ 50 ఇంచుల మోడల్ ధర రూ.33,999 గా ఉంది.
థామ్సన్ QLED 4K స్మార్ట్ టీవీ సిరీస్‌ 55 ఇంచుల వేరియంట్ ధర రూ.40,999 గా ఉంది.
థామ్సన్ QLED 4K స్మార్ట్ టీవీ సిరీస్‌ 65 ఇంచుల టాప్‌ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది.

Exit mobile version