CBI arrests Rishi Agarwal: ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ రిషి కమలేష్ అరెస్ట్ 

తీసుకున్న రుణాలను చెల్లించకుండా పలు బ్యాంకులను మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది

New Delhi: తీసుకున్న రుణాలను చెల్లించకుండా పలు బ్యాంకులను మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2001 నుండి ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి కంపెనీకి రుణ సౌకర్యాలు మంజూరు చేయబడ్డాయి. జరిపిన లావాదేవీల్లో రూ. 22,842 కోట్ల మేర కంపెనీ యాజమాన్యం మోసం చేసిన్నట్లు సీబీఐ గుర్తించింది.

2005 నుండి 2012 మద్యకాలంలో ఐసిఐసిఐ, ఎస్బీఐ తో పాటు 26 బ్యాంకుల కన్సార్టియం ద్వార చెల్లింపుల జరిపిన్నట్లు తేల్చారు. 2019 లో ఏబీజీ కంపెనీ ఖాతాలన్నీ మోసపూరితమైనవిగా బ్యాంకులు గుర్తించాయి. 2013లో కంపెనీ నిర్వహణ లేని ఆస్తులుగా మార్చిన్నట్లు వార్షిక లెక్కల్లో చూపించారు. సంస్ధలోని డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ లు రూ. 22842 కోట్ల మేర మోసం చేసిన్నట్లు నిర్ధారించారు. మోసం చేసిన నగదును విదేశీ అనుబంధ సంస్ధల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన్నట్లుగా కూడా అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ ను నమెదు చేసివున్నారు. ఈ నేపధ్యంలో రిషి కమలేష్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.

మాజీ ఛైర్మన్ అగర్వాల్, ఇతరులపై నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం వంటి నేరాల కింద కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కంపెనీ నమోదు చేసింది.