First Republic Bank: అమెరికా సిలికాన్ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకుల దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్ అదే దిశగా పయనం అవుతోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ తో పాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్‌గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది.
ఆగని షేర్ల పతనం(First Republic Bank)
ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు మార్చి12న ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి.
ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో తో సహా ఒప్పందాల కార్యకలాపాల నిర్వహణ కోసం 70 బిలియన్
డాలర్లకు పైగా అన్‌ఓపెన్డ్ లిక్విడిటీని కలిగి ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
అయినా కూడా బ్యాంక్ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత పెద్ద బ్యాంకింగ్ సంస్థలు స్టాక్ మార్కెట్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్,
జియన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి.
బ్యాంకింగ్ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై బ్యాంకింక్ సంస్థలు ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్ ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
క్షీణించిన స్టాక్ విలువ
తాజాగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం క్షీణించింది.
ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలనే ఇచ్చాయి.
ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించగా.. వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయినట్టు వియాన్ అనే సంస్థ పేర్కొంది.