Elon Musk Net worth: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే కూడా బాగా తగ్గిపోయింది. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి 44 బిలియన్ డాలర్లను చెల్లించడానికి టెస్లాకు చెందిన 15 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించారు. మరో 13 బిలయన్ డాలర్ల రుణం తీసుకున్నారు. మొత్తం కలిపి 33.5 బిలియన్ డాలర్ల ఈక్విటీని సమకూర్చాల్సి వచ్చింది.
ఈ దెబ్బతో మస్క్ నికర సంపద మంగళవారం నాటికి 200 బిలియన్ డాలర్ల కంటే కిందికి దిగివచ్చింది. ఇన్వెస్టర్లు టెస్లా షేర్లను వదించుకోవడానికి మొగ్గు చూపారు. కాగా మస్క్ తన ఎలక్ర్టిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా కంటే కూడా ట్విట్టర్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని ఇన్వెస్టర్లు భావించి టెస్లా షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపారు. ఎలాన్ మస్క్ నికర సంపద ఫోర్బ్స్ అంచనా ప్రకారం 194.8 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది.
టెస్లాలో మస్క్‌కు 15 శాతం వాటా ఉంది. కాగా టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 622 బిలియన్ డాలర్లుగా తేలింది. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన వెంటనే దాని ప్రభావం టెస్లా షేరు పై పడింది. మార్కెట్ క్యాప్ సగానికి సగం దిగివచ్చింది. నికర విలువ 70 బిలియన్ డాలర్ల వరకు కరిగిపోయింది. ఇన్వెస్టర్లు ఆందోళన ఏమిటంటే మస్క్ టెస్లాను ఇక పట్టించుకోడు. ఇకపై తన దృష్టి అంతా ట్విట్టర్‌పైనే ఫోకస్ పెడతారని భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్లను విక్రయించి బయటపడాలనుకుంటున్నారు.