Site icon Prime9

Elon Musk: ట్విట్టర్ పై మరోమారు ఎలన్ మస్క్ ఫైర్.. 90శాతం నకిలివేనంటూ..

elon musk fire on twitter prime9 news

elon musk fire on twitter prime9 news

Elon Musk: ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్ పై చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్విట్టర్‌ కొనుగోలుకు ప్రయత్నించి… కొన్ని కారణాల దృష్ట్యా ఎలన్ మస్క్ ఆ డీల్‌ను రద్దు చేసుకున్న విషయం విధితమే. అయితే, ఆ డీల్‌ను ప్రతిపాదన మొదలుకుని డీల్ రద్దు అనంతరం కూడా ట్విట్టర్‌ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో మరోమారు ఎలన్ మస్క్ నెట్టింట ట్విట్టర్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో దాదాపు 20 శాతం ఖాతాలు స్పామ్ అని ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసిన ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90శాతం నకిలీవేనంటూ తెలిపారు. మీకు వచ్చిన లైక్ ల సంఖ్యలో అసలైన యూజర్ల నుంచి వచ్చేవి ఎన్ని ఉంటాయంటూ ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ ఈ విధంగా స్పందించారు. తాజాగా తన ట్వీట్‌కు వచ్చిన ఓ రిప్లై గురించి ఆయన వివరించారు. క్రిప్టోకరెన్సీ ఎక్స్ ఛేంజ్ సంస్థ బైనాన్స్‌ సీఈఓ చాంగ్‌పెంగ్‌ ఝావో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీదే అని ఎలాన్ మస్క్ తెలిపారు. దానిని ఫొటో తీసి షేర్ చేసిన మస్క్‌, తన పోస్టులకు వచ్చే రిప్లైలలో 90శాతం బాట్‌ల నుంచే వస్తాయని వెల్లడించారు. ట్విట్టర్‌లో ప్రతి పది అకౌంట్లలో ఎనిమిది స్పామ్ అని పేర్కొంటూ ఇటీవల ఓ సైబర్‌నిపుణుడు ఇచ్చిన నివేదిక పైనా మస్క్‌ స్పందించారు.

ఇదిలా ఉండగా ట్విట్టర్​ను తన కొనుగోలు చేసుకునేందుకుగానూ మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకోగా, నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విట్టర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఆ ఒప్పందాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. ట్విట్టర్‌లో చెప్పిన దానికంటే నాలుగింతలు ఎక్కువగా నకిలీ ఖాతాలు ఉన్నాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.

Exit mobile version