Site icon Prime9

Elon Musk: చాట్ జీపీటీకి పోటీగా మస్క్ మరో కొత్త కంపెనీ.. పేరేంటంటే

Elon Musk

Elon Musk

Elon Musk: సంచలనాలకు మారుపేరుగా పిలుచుకొనే ట్విటర్‌, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందనే చెప్పాలి. ప్రతి రంగంలోనూ ఏఐ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. తక్కువ కాలంలో ఆక్యురేట్ సమాచారాన్ని అందించండంలో ఏఐ తనదైన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ‘ఓపెన్‌ఏఐ’ సృష్టించిన చాట్‌బాట్‌ ‘చాట్‌జీపీటీ’ అనేక విప్లవాత్మక పరిణామాలకు దారితీసింది. కాగా ప్రస్తుతం దీనికి పోటీగా మస్క్ ఎక్స్‌ఏఐ(xAI) పేరుతో మరో కృత్రిమ మేధ కంపెనీని నెలకొల్పబోతున్నారు. దీనితో మస్క్‌ పోర్ట్‌ ఫోలియోలో మరో కంపెనీ జత కాబోతోంది. ఈ ఏఐ(AI) వెబ్‌సైట్‌ను బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కృత్రిమ మేధ కంపెనీ లక్ష్యం విశ్వాన్ని నిజంగా అర్థం చేసుకోవడమేనని మస్క్‌ వెల్లడించారు.

చాట్ జీపీటీకి పోటీ(Elon Musk)

‘‘మా బృందానికి ఎలాన్‌ మస్క్‌ నేతృత్వం వహించనున్నారు. గూగుల్‌ డీప్‌మైండ్‌, ఓపెన్‌ఏఐ, గూగుల్‌ రీసెర్చ్‌, మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌, టెస్లా తదితర వాటిల్లో పనిచేసిన నిపుణులు ఇందులో భాగమయ్యారు’’ అని ఎక్స్‌ఏఐ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

కృత్రిమమేధలో పెను విప్లవంగా మారిన ‘చాట్‌జీపీటీ’ అభివృద్ధిలో మొదట ఎలాన్‌ మస్క్‌ భారీ పెట్టబడులు పెట్టారని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వాటిని ఉపసంహరించుకున్నారని తెలిపారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఇందులో పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఏఐకి సంబంధించి మానవాళికి ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు మస్క్‌ హెచ్చరించారు. కాగా ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను కూడా కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకువచ్చానని మస్క్ పేర్కొన్నారు.

Exit mobile version