Site icon Prime9

Dr Reddys: డాక్టర్ రెడ్డీస్ లాభం… రూ. 1,113 కోట్లు

dr reddys laboratories profits

dr reddys laboratories profits

Dr Reddys: దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీలలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఒకటి. ఈ కంపెనీ నుంచి తయారయ్యిన మందులు భారత దేశంలోనే కాకుండా ఇతర దేశవిదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. కొన్ని వేల కోట్ల టర్నోవర్ కలిగిన రెడ్డీస్ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలు వచ్చాయని వ్యాపార వర్గాలు తెలిపారు. 2022-23 ఏడాదిలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,113 కోట్ల నికర లాభాన్ని గడిచింనట్టు ప్రకటించింది.

సరిగ్గా ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.992 కోట్ల అని దానితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన లాభం సుమారు 12 శాతం పెరిగిందని వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం 9 శాతం పెరిగి రూ.5,763 కోట్ల నుంచి రూ.6,306 కోట్లకు చేరిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒక త్రైమాసికంలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదేనని కంపెనీ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో రష్యాలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం, ఫారెక్స్‌ రేట్లలో అనుకూల మార్పులు కంపెనీపై సానుకూల ప్రభావాన్ని చూపాయని తెలిపింది.
డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి అయిన లెనాలిడోమైడ్‌ క్యాప్సుల్స్‌ను అమెరికా మార్కెట్లో విడుదల చేయడం ఫలితాలు ఆకర్షణీయంగా ఉండడానికి దోహదం చేసిందని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోగులకు ఆమోదయోగ్యమైన ధరల్లో అందరికీ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రోగులకు సరసమైన ధరల్లో కొత్త ఔషధాలను విడుదల చేయడంపై కంపెనీ ఎల్లవేళల కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: ట్విటర్ లో సినిమాలు, గేమ్స్.. ఆ దిశగా ఎలన్ మస్క్ అడుగులు

Exit mobile version