Bank employees: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాల అనే అంశం ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారానికి 5 రోజుల పనివేళలను అమలు చేసే దానిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
చాలాకాలంగా పెండింగ్‌లో(Bank employees)
గవర్నమెంట్ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు గతంలో భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. అయితే ఈ అంశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వేజ్ బోర్డులో సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మీడియా కథనాలు తెలిపాయి.
ఐబీఏ అంగీకారంతో..
కరోనా సమయంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు డిమాండ్ చేశాయి. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఇందుకు తిరస్కరించింది. అయితే వేతనంలో 19 శాతం పెంచుతామని ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదనకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంగీకరించలేదు. తమకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తూ.. పింఛను, ఇతర డిమాండ్లతో ఈ ఏడాది జనవరిలో రెండు రోజుల సమ్మె ప్రకటించింది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ సమ్మెను వాయిదా వేసింది.
తర్వాత, ఈ ఫిబ్రవరిలో బ్యాంకు యూనియన్లతో భారత బ్యాంకుల సంఘం చర్చలు జరిపింది. వారానికి ఐదు రోజుల పని విధానం డిమాండ్‌ను పరిశీలిస్తామని తెలిపింది. అయితే అందుకు బదులుగా ఉద్యోగుల రోజువారీ పని వేళలను మరో 40 నిమిషాలు పెంచుతామని పేర్కొంది. బ్యాంకు యూనియన్లు అందుకు అంగీకారం తెలపడంతో ఐబీఏ ఐదు రోజుల పనిపై కేంద్రానికి ప్రతిపాదనలు చేసిందని సమాచారం. ఒక వేళ ఈ విధానం అమల్లోకి వస్తే.. బ్యాంకు ఉద్యోగులు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బ్యాంకులో పనిచేయాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాల్గొ శనివారాలు సెలువు దినాలుగా ఉన్నాయి.