IPhone14 Pro smartphone: రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్ యాపిల్ మొబైల్ దిగ్గజ సంస్ద మరో అద్భుత ఫోన్ తయారీకి సిద్ధమైంది. కార్ రేస్ అభిమానుల కోసం ప్రత్యేక ఆకర్షణీయ మోడల్ లో ఐ ఫోన్ ను తయారు చేయనున్నారు. మన దేశ కరెన్సీలో రూ. 1.1కోట్ల రూపాయల దర పలికే ఈ మొబైల్ కు ఐఫోన్ 14 ప్రో గా దిగ్గజ సంస్ధ నామకరణం చేసింది. తొలి విడత తయారీలో కేవలం 3 ఫోన్లను మాత్రమే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతకీ కోటి రూపాయలు పైగా విలువ చేసే ఆ ఫోన్ లోని విశేషాలను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
స్పెషల్ ఎడిషన్ గా పేర్కొన్న ఐఫోన్ 14 ప్రోను క్యాంప్ బెల్ కంపెనీకి చెందిన బ్లూ బర్డ్ సూపర్ కార్, రోలెక్స్ డేటోనా వాచీలను సూచిస్తూ యాపల్ సంస్ధ ఫోన్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఫోన్ వెనుక భాగానా ప్యానెల్‌పై రోలెక్స్ వాచ్‌ను పొందుపరచడం జరిగిందని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా వాచ్ లో 8 వజ్రాలతో పాటు బంగారు కలర్ లో రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ను వెనుకభాగాన ఉండేలా డిజైన్ చేశారు
.
ఫోన్ బాడీని 1930 నాటి రేసింగ్ కార్ల శైలిలో తయారు చేయబడింది. ప్రత్యేక ఎడిషన్ ఐఫోన్ 14 ప్రో మోడల్ లో ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ డెకరేటివ్ డయల్స్ మొబైల్ వాడకందారులను కట్టిపడేయనుంది. మొబైల్ లో సాంకేతికతను జోడిస్తూ స్పీడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్‌లు 18 క్యారెట్ల బంగారాన్ని వినియోగించారు. జోడించిన ఎనామెల్ పెయింట్ తో ఫోన్ కలర్ ఫుల్ గా ఉండనుంది. పై భాగంలో ఏర్పాటు చేసిన డ్యాష్‌బోర్డ్ స్విచ్‌లను బంగారంతో తయారు చేశారు. 5 రక్షణ స్థాయిలతో అంతర్జాతీయ ప్రమాణపత్రాన్ని కలిగివుండేలా మొబైల్ ఫోన్ ను తయారచేశారు. టైటానియం, బ్లాక్ కోటింగ్‌తో చేసిన లేయర్డ్ కేస్ బాడీ వాడకందారులను ఆకట్టుకోనుంది. ఫోన్ తయారీపై స్పందించిన కంపెనీ యాజమాన్యం అలనాటి కీలక తయారీ వస్తువులను గుర్తుకు తీసుకొచ్చే క్రమంలో నూతన మొబైల్ ఫోన్ ను తయారుచేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Twitter: ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా భారత సంతతి వ్యక్తి.. మస్క్ ప్రకటన