Site icon Prime9

Air India: నాన్ ఫ్లయింగ్ స్టాఫ్ కూ ఎయిర్ఇండియా వీఆర్ఎస్ స్కీం

Air India

Air India

Air India: ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిరిండియా మరో సారి స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రకటించింది.

ఎయిర్ ఇండియా(Air India) ను టాటా గ్రూప్ టేకోవర్ చేసిన తర్వాత వీఆర్ఎస్ ను ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా నాన్ ఫ్లయింగ్ స్టాఫ్ కు వీఆర్ఎస్ ను ఎంచుకునే సదుపాయాన్ని కల్పించింది.

పర్మినెంట్ జనరల్ కేడర్ కు చెందిన ఉద్యోగులతో పాటు క్లరికల్, నైపుణ్యం లేని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ఎయిరిండియా తెలిపింది.

ఈ వీఆర్ఎస్ కు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 40 ఏళ్లు దాటిన వాళ్లు అర్హులు.

మార్చి 17 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.

ఒక వేళ మార్చి 31 లోపు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునే వారికి ఎక్స్ గ్రేషియా మొత్తంపై రూ. లక్ష అదనంగా చెల్లిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.

తాజాగా స్వచ్ఛంద విరమణ పథకానికి దాదాపు 2100 మంది ఉద్యోగులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

జూన్ లో తొలి విడత వీఆర్ఎస్(Air India)

టాటా గ్రూప్ గత ఏడాది ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంస్థను లాభాల్లోకి తీసుకుచ్చేందుకు పలు చర్యలు ప్రారంభించింది.

ఈ క్రమంలోనే సంస్థలోకి కొత్త జనరేషన్ కు అవకాశం కల్పించేందుకు.. పాత తరానికి చెందిన ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా గత ఏడాది జూన్ లో తొలి విడత వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ సిబ్బందికి ఈ స్కీమ్ ను వర్తింపజేసింది.

మొత్తం 4200 మంది ఈ పథకానికి అర్హులు కాగా, అందులో 1500 సిబ్బంది వీఆర్ఎస్ ఎంచుకున్నారు.

అయితే ఇతర ఉద్యోగుల కోరిక మేరకు రెండో విడత వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది.

మరో వైపు భారీ సంఖ్యలో విమానాలకు ఆర్డర్ పెట్టిన ఎయిరిండియా ఈ ఏడాది 5 వేల మంది కొత్త సిబ్బందిని నియమించుకోనున్నట్టు ఇటీవల ప్రకటించింది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ తో కలిపి మొత్తం 11 వేల మంది ఎయిరిండియాలో పనిచేస్తున్నారు.

 

 

Exit mobile version