Site icon Prime9

Adani Group: ఒడిశా ట్రాజెడీలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య

Adani Group

Adani Group

Adani Group: ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ మొత్తం తల్లడిల్లింది. దేశ రైల్వే చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదంగా నిలిచింది. ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పయిన వారెందరో. ఈ క్రమంలో కోరమాండల్ ప్రమాదంలో తల్లిదండ్రులను పొగొట్టుకున్న బాధిత చిన్నారులకు ఉచిత పాఠశాల విద్యను అందించేందుకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ ముందుకొచ్చారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులైన వారి కుటుంబాలకు సాయం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పిల్లలకు మంచి భవిష్యత్‌ కల్పించేందుకు వీలుగా పాఠశాల విద్యను ఉచితంగా అందిస్తామని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు.

 

 

మృతులు 288 కాదు.. 275(Adani Group)

గత మూడు దశాబ్దాల్లోనే అతి పెద్దదైన ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్టు ఈ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ వెల్లడించారు. కొన్ని మృతదేహాలను పొరపాటున రెండు సార్లు లెక్కించడంతో మృతుల సంఖ్య 288 గా వచ్చిందన్నారు. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మరో వైపు క్షతగాత్రుల సంఖ్య 1175 గా ఉందని, వారిలో 793 మంది ఇప్పటికే హాస్పిటల్ నుంచి డిశ్చర్జ్ అయ్యారని తెలిపారు. మిగిలిన 382 మందికి ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.

 

78 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించామన్నారు. మిగతా మృతదేహాలను భువనేశ్వర్ లోని ఎయిమ్స్, ఇతర హాస్పటిల్స్ లో భద్రపరిచామని తెలిపారు. నిబంధనల ప్రకారం 48 గంటల పాటు ఆయా చోట భద్రపరిచి.. తర్వాత డీఎన్ఏ పరీక్షలు చేయించి.. అవసరం అయితే దహన సంస్కారాలు చేయిస్తామన్నారు. అదే విధంగా చనిపోయిన వారి ఫొటోలను భువనేశ్వర్ నగరపాలక సంస్థ వెబ్ సైట్ లో పెట్టామని చెప్పారు.

 

Exit mobile version