Site icon Prime9

INd vs NED: మూడు హాఫ్ లతో.. భారత జట్టు మరో అఖండ విజయం

india-won-by-56-runs-against-netherlands in t20 world cup 2022

india-won-by-56-runs-against-netherlands in t20 world cup 2022

INd vs NED: టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు మంచి ఫాం కనపరుస్తోంది. పొట్టి ప్రపంచకప్ లో ఇండియా తన రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ గ్రూప్‌ 2లోని నెదర్లాండ్స్‌తో జరిగిన పోటీలో 56 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా నెదర్లాండ్స్ ముంగిట 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 రన్స్‌ మాత్రమే చెయ్యగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, హర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు ఒక్కొక్కరు తలో రెండు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూప్‌ 2లో ఇండియా నాలుగు పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఒక గ్రూపు నుంచి టాప్‌ రెండు జట్లు మాత్రమే పొట్టి ప్రపంచకప్ సెమీస్‌కు వెళ్లనున్నాయి.

అంతకముందు ముందు బ్యాటింగ్ కు దిగిన ఇండియన్‌ టాపార్డర్‌ బ్యాటర్లు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 రన్స్‌ చేసింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు హాఫ్‌ సెంచరీలతో మైదానంలో పరుగుల వరద పారించారు. నిజానికి సిడ్నీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించలేదు.కాగా ఈ మ్యాచ్లో సూర్యకుమార్‌ కేవలం 25 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దానితో అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఇదీ చదవండి: రిలీ రూసో సూపర్ సెంచరీ.. పొట్టి ప్రపంచ కప్ లో ఇదే మొదటిది

Exit mobile version