Site icon Prime9

IND vs BAN: విరాటుడి విశ్వరూపం.. బంగ్లా టార్గెట్ @185

IND vs BAN first half match t20 world cup 2022

IND vs BAN first half match t20 world cup 2022

IND vs BAN: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. టాల్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటర్లు బరిలోకి దిగారు. ఫస్ట్ హాప్ ముగిసే సరికి భారత్ 184 పరుగులు చేసి బంగ్లాకు185 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది.

పాకిస్తాన్‌, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది. దాంతో సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్‌పై భారత్ గెలవడం తప్పనిసరి అయింది. మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా టీమిండియాతో సమానంగా 4 పాయింట్స్ ఉండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. టాల్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దానితో భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. రోహిత్ పిచ్ పై ఎంతసేపో కొనసాగలేకపోయాడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వా బరిలోకి దిగిన కోహ్లీ సహాయంతో రాహుల్ విజృంభించాడు. హాఫ్ సెంచరీ చేసి రాహుల్ క్యాచ్ ఔట‌య్యాడు సూర్యకుమార్ యాదవ్ 30 పరుగుల చేసి భారీ షాట్ ఆడబోయి షకిబుల్ ‌హాసన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా తక్కువ పరుగులు 5కే వెనుదిరిగాడు.

17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు పూర్తి చేసింది. ఈ క్రమంలో కోహ్లీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అజేయంగా రాణిస్తున్నాడు. ఇకపోతే దినేష్ కార్తిక్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరూ చెరో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక మొదటి హాఫ్ మ్యాచ్ ముగిసే సరికి టీం ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి బంగ్లాకు 185 పరుగుల టార్గెట్ ఇచ్చింది.

ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1

Exit mobile version