Mizoram: మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికుల మృతి..

మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో బుధవారం కనీసం 17 మంది కార్మికులు మరణించారు.ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 12:39 PM IST

Mizoram: మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో బుధవారం కనీసం 17 మంది కార్మికులు మరణించారు.ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో 35-40 మంది కార్మికులు ఉన్నారని  పలువురు వ్యక్తులు శిధిలాల కింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుండి ఇప్పటివరకు పదిహేడు మృతదేహాలను వెలికితీశారు. ఇంకా పలువురు వ్యక్తులను వెలికితీయవలసి ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు.. (Mizoram)

మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది; కనీసం 15 మంది కార్మికులు మరణించారు. రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం, బాధ కలిగింది. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి X (అధికారికంగా ట్విట్టర్) లో పోస్ట్ చేసారు.