Site icon Prime9

UPI Lite: ఫోన్ పే లో కొత్త ఫీచర్ లాంచ్.. ఆ చెల్లింపులకు పిన్ అవసరం లేకుండా

UPI Lite

UPI Lite

UPI Lite: ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే డిజిటల్ చెల్లింపుల కోసం మరో ఆష్షన్ ను తీసుకొచ్చింది. రూ. 200 లోపు ఉండే చిన్న చిన్న లావాదేవీల కోసం ‘యూపీఐ లైట్’ అనే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల రూ. 200 లోపు లావాదేవీలకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని ఫోన్ పే వెల్లడించింది. అందుకోసం ముందుగా యూపీఐ లైట్ లో రూ. 2000 వరకు జమ చేసుకోవచ్చు. ఫలితంగా బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా చెల్లింపులు పూర్తి అవుతాయి. చెల్లింపులు జరిగేటపుడు ఎలాంటి అవాంతరాలు ఉండవని తెలిపింది.

కేవైసీ అవసరం లేదు(UPI Lite)

యూపీఐ లైట్ ప్రస్తుతం ఉండే ఫోన్ పే యాప్ లోనే అందుబాటులో ఉంటుందని.. ప్రత్యేకంగా కేవైసీ అవసరం లేదని పేర్కొంది. బ్యాంక్ అకౌంట్ వివరాల్లో చిన్న చిన్న లావాదేవీలు నమోదై అవ్వకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఫోన్‌పే యూపీఐ లైట్‌ను దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్‌ నిఘమ్‌ తెలిపారు. యూపీఐ మర్చంట్‌, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా యూపీఐ లైట్‌ వినియోగంతో ఆయా చెల్లింపులపై యూజర్లకు మెసేజ్‌ అలెర్ట్‌ వస్తుంది. యూజర్లు ఏ రోజు ఎలాంటి లావాదేవీలు చేశారో తెలుసుకునేందుకు వీలుగా హిస్టరీ కూడా చూడొచ్చు.

కాగా ఇలాంటి ఫీచర్ ను ఫోన్‌పే పోటీ సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీఐ లైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది.

 

నెట్‌వర్క్‌ లేకుండా

మరో వైపు ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలలో జరిపే లావాదేవీలు చేసేటప్పుడు నెట్‌వర్క్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్‌లో నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీపీఐ) నెట్‌వర్క్‌ లేకుండా రూ. 200 లోపు చిన్న చిన్న లావాదేవీలు చేసేలా అనుమతిచ్చింది.

Exit mobile version