Site icon Prime9

Twitter Blue: ఇండియాలో లాంచ్ అయిన ట్విటర్ బ్లూ.. సబ్ స్క్రిప్షన్ రూల్స్ ఇవే

twitter

twitter

Twitter Blue: ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత బిలియనీర్ ,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారీగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విటర్ బ్లూ టిక్ (Twitter Blue) సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే, జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు లో ఉన్న ఈ సేవల్ని.. ఇపుడు భారత్ లో లాంచ్ చేసింది ట్విటర్.

ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు నెలకు రూ. 900 చెల్లిస్తే ఈ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ లభించనుంది. అదే వెబ్ సబ్ స్క్రిప్షన్ కోసం అయితే నెలకు రూ. 650 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ప్లాన్ ధర రూ 6,800గా ఉంది. ట్విటర్ లో తమ ప్రొఫైల్ కు బ్లూ టిక్ పొందాలను కున్న వినియోగదారులు ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు. దీంతో మరిన్ని ఫీచర్లు కూడా అదనంగా లభిస్తాయి. నిర్దేశిత చందా చెల్లించిన తర్వాత ప్రొఫైల్ పక్కన బ్లూ మార్క్ వస్తుంది.`

గతంలో ప్రముఖులకే.. (Twitter Blue)

ఇంతకుముందు ట్విటర్ బ్లూ ట్రిక్.. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, జర్నలిస్టులతో పాటు అతి ముఖ్యమైన వ్యక్తుల ఖాతాలకు వెరిఫై బ్లూ ట్రిక్ ఉండేది. అయితే ఎలాన్ మస్క్ ట్విటర్ పగ్గాలు చేపట్టిన తర్వాత మార్పులు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా వచ్చిందే ఈ బ్లూ ట్రిక్ సబ్ స్క్రిప్షన్. ఎవరైతే బ్లూ సబ్ స్క్రిప్షన్ తీసుకొంటారో.. వారికి బ్లూ వెరిఫికేషన్ మార్క్ ఇస్తారు. అదేవిధంగా ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్ లోడ్ చేసేందుకు వీలు ఉంటుంది.

 సబ్ స్క్రిప్షన్  రూల్స్ (Twitter Blue)

ట్వీట్ ను ఎడిట్ చేసుకోవడం, ఐకాన్స్ ను కస్టమైజ్ చేసుకోవడం, థీమ్స్ మార్చుకోవడం, మెసేజ్లకు రిప్లై ఇవ్వడంలో ఇంపార్టెన్స్ ఇస్తారు.

ఒక ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల్లోపు 5 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో మరో వెసులు బాటు కూడా కల్పించారు.

సబ్ స్క్రిప్షన్ పొందిన వారికి.. మిగతా వారి కంటే సగం యాడ్స్ తగ్గుతాయి.

ఈ ప్రీమియం ఫీచర్ల ద్వారా యూజర్లకు మరింత సౌలభ్యమైన సేవలను అందించడమే లక్ష్యం అని ట్విటర్ పేర్కొంది.

కాగా ప్రస్తుతం బ్లూ ట్రిక్ పొందేందుకు ట్విటర్ కొన్ని రూల్స్ పెట్టింది.

 

బ్లూ టిక్ మార్క్ (Twitter Blue) కోసం దరఖాస్తు చేసుకునే తేదీకి కనీసం 90 రోజుల ముందు ట్విటర్ లో ఉండాలి.

ఒక సారి సబ్ స్క్రైబ్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఫొటో , డిస్ ప్లే పేరు, ఖాతా దారుని పేరు మార్పలు చేస్తే.. తిరిగి వెరిఫికేషన్ చేసే వరకు బ్లూ మార్క్ కోల్పోతారు.

కాబట్టి ఈ వ్యాలిడేషన్ టైమ్ లో ఎలాంటి మార్పులకు అనుమతి ఉండదు. ఒక వేళ ఖాతాదారులు బ్లుూ ట్రిక్ సబ్ స్క్రిప్షన్ ను వద్దు అనుకుంటే రద్దు చేసుకునే వీలు కల్పించింది ట్విటర్.

బిల్లింగ్ ప్రాసెస్ ముగియకముందే రద్దు లేదా పునరుద్దరించకోవడం చేసుకోవాలి.

ఆటో రెన్యూవల్ కి 24 గంటల ముందే క్యాన్సిల్ చేసుకోవాలి.

లేదంటే అప్పటికే కట్టిన అమౌంట్ వెనక్కి లభించదు.

Exit mobile version