Site icon Prime9

Tecno Camon 20 Series: టెక్నో క్యామాన్ లో మూడు ఫోన్లు విడుదల… ధరలు కూడా అందుబాటులోనే

Tecno Camon Series

Tecno Camon Series

Tecno Camon 20 Series: చైనాకు చెందిన టెక్నో మొబైల్స్‌ దేశీయ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేసింది. క్యా మాన్‌ సిరీస్‌ 20 పేరుతో మరో మూడు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. టెక్నో క్యామాన్‌ 20 , క్యామాన్‌ 20 ప్రో 5జీ , క్యామాన్‌ 20 ప్రీమియర్‌ 5జీ సెగ్మెంట్లతో వస్తున్న ఈ మూడు ఫోన్లను లాంచ్ చేసింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అప్పీరియెన్స్ బ్యాక్ ప్యానెల్ తో మీడియా టెక్‌ ప్రాసెసర్‌ ఉంది. అమోలెడ్‌ స్క్రీన్స్ పొందుపర్చారు.

ధరలిలా..(Tecno Camon 20 Series)

టెక్నో క్యామాన్‌ 20 ధర భారత్‌లో రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. మే 29 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ గ్లేషియర్‌ గ్లో, ప్రీడాన్‌ బ్లాక్, సెరినిటీ బ్లూ రంగుల్లో లభ్యం అవుతోంది.

మరోవైపు టెక్నో క్యామాన్‌ 20 ప్రో 5జీ లో రెండు వేరియంట్లు తీసుకొచ్చారు. 8GB + 128GB ధర రూ. 19,999 గా ఉండగా.. 8GB + 256GB ధర రూ. 21,999 గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లు జూన్‌ రెండో వారం నుంచి అమ్మకానికి వస్తాయి. కాగా, టెక్నో క్యామాన్‌ 20 ప్రీమియర్‌ దేశీయంగా జూన్‌ చివరికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. ధరతో పాటు ఇతర వివరాలను కంపెనీ ప్రకటించలేదు.

 

స్పెసిఫికేషన్లు..

టెక్నో క్యామాన్‌ 20 , టెక్నో క్యామాన్‌ 20 ప్రో ఫీచర్లు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. రెండింటిలో 6.67 ఇంచుల హెచ్‌డీ+ అమోలెడ్‌ స్క్రీన్ వస్తోంది. అయితే, ప్రో మోడల్‌లో రీఫ్రెష్‌ రేట్‌ 120Hz గా ఇచ్చారు. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఆధారిత HiOS 13.0 out of the box ఓఎస్‌ ను కలిగి ఉన్నాయి. క్యామాన్‌ 20లో 12nm మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. అదే ప్రో మోడల్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో వస్తోంది.

టెక్నో క్యామాన్‌ 20 తో పాటు 20ప్రో లో కూడా 64ఎంపీ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ, వైఫై, బ్లూటూత్‌ 5, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ ఉన్నాయి. క్యామాన్‌ 20 ప్రో మాత్రం 5జీని కూడా సపోర్ట్‌ చేయనుంది. యాక్సెలరో మీటర్‌, ఈ కంపాస్‌, యాంబియెంట్‌ లైట్‌ లాంటి సెన్సర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలో 5,000 mAh బ్యాటరీలను అమర్చారు. క్యామాన్‌ 20 ని 18 Wat చార్జర్‌తో ఇస్తున్నారు.

 

Exit mobile version