Poco C51: షావోమి సబ్ బ్రాండ్ పోకో భారత మార్కెట్లోకి మరో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. పోకో సీ51(Poco C51) పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ 36 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. 4 జీబీ + 54 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. వర్చువల్‌గా ర్యామ్‌ను 7జీబీ వరకు ఎక్స్ఫాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా ఇచ్చారు.
ధర, ఫీచర్లివే..(Poco C51)
పోకో సీ51ధరను రూ. 8,499 గా కంపెనీ నిర్ణయించింది. కానీ, లాంచింగ్ ఆఫర్ కింద రూ. 7,999 కే అందిస్తున్నారు. అయితే, ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉండనుందో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. కానీ, విక్రయాలు మాత్రం మొదలు కాలేదు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ వర్తించనుంది. ఎంపిక చేసిన ఇతర బ్యాంకు కార్డులపై కూడా రూ. 700 వరకు రాయితీ వస్తోంది. నెలకు రూ. 299 నుంచి ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తున్న ఈ పోకో సీ51 ఫోన్‌లో 6.52 హెచ్‌డీ స్క్రీన్ ఉంది. ఇది 4 జీ ఫోన్ గా కంపెనీ పేర్కొంది. ముందు వైపు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.