Site icon Prime9

Pixel Fold: ఇట్స్ కన్ఫామ్.. గూగుల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్

Pixel Fold

Pixel Fold

Pixel Fold: గత కొంతకాలంగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌ రాబోతోందంటూ రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలను ఆ రూమర్స్ ని నిజం చేస్తే పిక్సెల్ ఫోల్డ్ ను తీసుకొస్తోంది గూగుల్‌. దీనిని సంస్థ అధికారంగా ధ్రువీకరించింది. పిక్సెల్‌ ఫోల్డ్‌ పేరితో మడతపెట్టే ఫోన్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది.

 

పిక్సెల్ ఫోల్డ్ టీజర్ రిలీజ్(Pixel Fold)

పిక్సెల్‌ ఫోల్డ్‌ ఫోన్‌ ఎలా ఉండబోతుందో చూపిస్తూ గూగుల్ ఓ వీడియో టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మే 10 నుంచి ప్రారంభం కానున్న సంస్థ వార్షిక సమావేశం ‘I/O 2023’లో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో పిక్సెల్‌ ఫోల్డ్‌ తో పాటు పిక్సెల్‌ 7ఏ స్మార్ట్‌ఫోన్‌, పిక్సెల్‌ ట్యాబ్లెట్‌ను కూడా పరిచయం చేయనుంది గూగుల్.

కాగా, పిక్సెల్‌ ఫోల్డ్‌ వీడియో టీజర్‌ చాలా చిన్నగా ఉన్నా.. ఫోన్‌ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఫోన్‌ డిజైన్‌, హింజ్‌ సపోర్ట్‌, స్క్రీన్, సాఫ్ట్‌వేర్‌, వెనుక వైపు 3కెమరాలు, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌ లాంటి వివరాలు స్పష్టంగా వీడియో లో కనిపిస్తున్నాయి. అయితే పిక్సెల్ ఫోల్డ్ కచ్చితమైన స్పెసిఫికేషన్లు తెలుసుకోవాలంటే మే 10 వరకు వెయిట్ చేయాలి.

కాగా, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం పిక్సెల్ ఫోల్డ్ టెన్సర్ జీ2 ప్రాసెసర్ తో రానున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రాసెసర్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే ఉంది. 48 మెగా పిక్సెల్ కెమెరా ఆప్షన్ ఇవ్వనున్నట్టు సమాచారం. సెల్ఫీల కోసం ఔటర్ డిస్ ప్లే 9.5 మెగా పిక్సెల్ , ఇన్నర్ డిస్ ప్లే 8 మెగా పిక్సెల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

 

తగ్గిన పిక్సెల్ 7 సిరీస్ ధరలు

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ధరలను తగ్గించింది. సేల్ ప్రారంభం అయ్యాక పిక్సెల్ 7 పై మరిన్ని డిస్కౌంట్స్ ఉండనున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన ఈ ఫోన్లలో ప్రత్యేకమైన టెన్సర్ జీ2 ప్రాసెసర్ ఉంటుంది. 30 Wat ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

ధరల్ని తగ్గించిన తర్వాత ప్రస్తుతం గూగుల్‌ పిక్సెల్‌ 7 ధర రూ. 49,999 గా ఉంది. పిక్సెల్‌ 7 ప్రో ధరను రూ. 69,999 గా నిర్ణయించారు. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్లు వరుసగా రూ. 59,999, రూ. 84,999 ధరలతో మార్కెట్‌లోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ సేల్‌ లో ఆఫర్స్ ను బట్టి చూస్తే మరో రూ. 5 వేలు వరకు తగ్గే అవకావం ఉంది.

 

మే 11 న పిక్సెల్ 7 ఏ

 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 7 ఏ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. మే 11 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మే 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలు ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 

Exit mobile version