MS Dhoni: దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ అనగానే మొదట గుర్తుచ్చేది టీంఇండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని. బైక్స్ అంటే అంత ఇష్టం మహీకి. కొంచెం టైమ్ దొరికినా రాంచీ వీధుల్లో బైక్ లపై తిరగడం మరింత ఇష్టం. లగ్జరీ కార్లతో పాటు ఖరీధైన బైకులు కూడా ధోనీ గారేజీలో ఉన్నాయి.
తాజాగా ధోనీ గారేజీలో కొత్త బైక్ వచ్చి చేరింది. అదే ‘టీవీఎస్ రోనిన్’. ఇటీవల ధోని ఈ బైక్ ను కొనుగోలు చేశారు. ఈ టూ వీలర్‌ని ధోనీకి డెలివరీ చేసింది టీవీఎస్ మోటార్.
టీవీఎస్ స్టార్ సిటీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరి మహేంద్ర సింగ్ ధోని అంత ఇష్టపడి తీసుకున్న ఈ బైక్ విశేషాలేంటో చూద్దామా.
ధర ఎంతంటే..
టీవీఎస్ కంపెనీ గతేడాది రోనిన్ బైక్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ బైక్ బేస్ మోడల్ ధర రూ. 1,49,000 కాగా, టాప్ వేరియంట్ రూ. 1,68,750 వద్ద అందుబాటులో ఉంది.
కంపెనీ అన్ని వేరియంట్స్‌ని డ్యూయెల్ టోన్ కలర్స్‌లో అందిస్తోంది. ఇందులో ధోని రోనిన్ టాప్ వేరియంట్ కొనుగోలు చేశాడు.
రోనిన్ ఫీచర్లివే..(MS Dhoni)
ధోని డెలివరీ చేసుకున్న బైక్ ఫీచర్లు చూస్తే.. 225 సీసీ ఇంజిన్ కలిగి 20 బీహెచ్‌పీ పవర్ 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా గంటకు 120 కిమీ స్పీడ్ అవుతుంది.
ఈ బైక్ లో సైలెంట్ స్టార్ట్‌లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ కూడా కూడా ఉంది. టీవీఎస్ రోనిన్ రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్నింగ్,
క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ లాంటి ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు.
కొత్త రోనిన్ బైక్ డబుల్ క్రెడిల్ స్ప్లిట్ చాసిస్‌తో 41 మి.మీ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు గ్యాస్ ఛార్జ్డ్ మోనో షాక్ ను ఉపయోగించారు.
ఈ బైక్ ముందు, వెనుక భాగంలో స్పోర్ట్స్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ టీవీఎస్ రోనిన్ ఎక్స్ షోరూం ధర రూ. 1.49 లక్షలు కాగా, రూ. 1.69 లక్షల మధ్యలో అందుబాటులో ఉంది.
ధోనీ బైక్స్ కలెక్షన్స్
ధోనీ గ్యారేజ్ లో ఇప్పటికే కాన్ఫడరేట్ హెల్కాట్ ఎక్స్ 32, యమహా ఆర్డీ 350,అపాచీ ఆర్ఆర్ 310, హార్లీ డేవిడ్సన్ ఫాట్‌బాయ్,
బీఎస్ఏ గోల్డ్‌స్టర్, కవాసకీ నింజా జెడ్ఎక్స్14 ఆర్, కవాసకీ నింజా హెచ్2 లాంటి బైక్స్ ఉన్నాయి.
మెర్సిడెస్- బెంజ్ జీఎల్ఈ, ఆడీ క్యూ7, లాండ్ రోవర్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ వంటి లగ్జరీ కార్లు కూడా ధోనీ తన సొంతం చేసుకున్నారు. ఇపుడు టీవీఎస్ రోనిన్ దోని గ్యారేజ్ ని అలంకరించింది.