Site icon Prime9

Krafton BGMI: మళ్లీ భారత్ లో అడుగుపెట్టనున్న పాపులర్ మొబైల్ గేమ్

Krafton BGMI

Krafton BGMI

Krafton BGMI: పాపులర్ గేమ్ బీజీఎమ్ఐ ( బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) ఫ్యాన్స్ గుడ్ న్యూస్. మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ అయిన బీజీఎమ్ఐ మరోసారి భారత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్ జీ తర్వాత బాగా పాపులర్ అయిన ఈ గేమ్ ను గత ఏడాది నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గేమ్ ను భారత్ లో మళ్లీ రీ స్టార్ట్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. కానీ ప్రస్తుతానికి ఈ గేమ్ ను 3 నెలల ట్రయల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ తెలిపారు.

 

 ట్రయల్ రన్ కు మాత్రమే(Krafton BGMI)

గేమింగ్ కంపెనీ డేటా భద్రత, సర్వర్ లొకేషన్లు సంబంధించి అన్ని నిబంధనలు పాటించినందువల్ల ఈ ట్రయల్ రన్ కు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్ లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భారత్ లో అనుమతి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్ లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాప్టన్ తెలిపింది.

 

ఏడాది నిషేధం తర్వాత

చైనాకు చెందిన యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్‌జీ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్‌ కంపెనీ క్రాఫ్టన్‌ ‘బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా’ పేరుతో కొత్త గేమ్‌ను పరిచయం చేసింది. అయితే, చైనాకు చెందిన టెన్సెంట్‌తో.. గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ దేశానికి చెందిన ప్రహార్‌ అనే ఎన్జీవో తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను క్రాఫ్టన్‌ కొట్టిపారేసినా.. బీజీఎంఐపై నిషేధం తప్పలేదు. భారత్ లో నిషేధం సమయానికి ఈ గేమ్‌కు 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. తాజాగా మళ్లీ ఈ గేమ్ భారత్ లో అందుబాటులోకి రానుంది.

Exit mobile version