Site icon Prime9

Krafton BGMI: బీజీఎమ్ఐ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Krafton BGMI

Krafton BGMI

Krafton BGMI: పాపులర్ గేమ్ బీజీఎమ్ఐ ( బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) ఈ నెల 29 నుంచి భారత్లో అడుగుపెట్టనుంది. గేమర్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి రానుంది.

ట్రయల్ కు మాత్రమే(Krafton BGMI)

ఈ గేమ్ ను 3 నెలల ట్రయల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ తెలిపారు. గేమింగ్ కంపెనీ డేటా భద్రత, సర్వర్ లొకేషన్లు సంబంధించి అన్ని నిబంధనలు పాటించడం వల్లే ఈ ట్రయల్ రన్ కు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్ లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భారత్ లో అనుమతి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్ లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాప్టన్ తెలిపింది.

 

ప్రీలోడ్ కోసం అందుబాటులో(Krafton BGMI)

ఈ క్రమంలోనే బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.

కాగా, పబ్ జీ తర్వాత బాగా పాపులర్ అయిన బీజీఎంఐ ను గత ఏడాది భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గేమ్ ను మళ్లీ దేశంలో రీ స్టార్ట్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దాదాపు 10 నెలల సస్పెన్షన్‌ తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారతలో అడుగుపెట్టనుంది.

 

Exit mobile version