JioFiber: ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోకు చెందని బ్రాడ్ బ్యాండ్ విభాగం జియో ఫైబర్ తాజాగా యూజర్ల కోసం మరో ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. మూడు నెలల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఇంటర్నెట్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడనుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ. 1197 గా కంపెనీ నిర్ణయించింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.
ఇంటర్నెట్ కోరుకునే
90 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ప్రతినెల అపరిమిత డేటాతో పాటు కాల్స్ సదుపాయం ఈ ప్లాన్ లో ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో ఓటీటీ బెనిఫిట్స్ లభించవు.
కాగా జియో ఫైబర్ లో ప్లాన్స్ రూ. 399 నుంచి ప్రారంభం అవుతాయి. బేసిక్ ప్లాన్స్ కు లభించే సదుపాయాలే మూడు నెలల ప్లాన్ లోనూ ఉంటాయి. అయితే ప్రతి నెలా రీఛార్జి చేసుకునే దానికంటే ఒకేసారి రీఛార్జి చేసుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఒక వేళ ఛానల్స్, ఓటీటీ సదుపాయం కావాలంటే అధిక మొత్తం చెల్లించి ఇతర ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రూ. 1197 ప్లాన్ లాగానే 100 MBPSతో వచ్చే రూ. 699 ప్లాన్.. మూడు నెలకు రూ. 2097లకు, 150 MBPSతో వచ్చే రూ. 999 ప్లాన్ రూ. 2997కు, 300 MBPSతో వచ్చే రూ. 1499 ప్లాన్‌ను రూ. 4497.. ఇలా ప్రీపెయిడ్ ప్లాన్లను త్రైమాసిక ప్లాన్ల రూపంలో అందిస్తోంది జియో.
కాగా, టెలికాం మార్కెట్‌పై తనకంటూ ముద్ర వేసిన జియో.. అటు జియో ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలోనూ అంతే దూకుడుగా ముందుకెళుతోంది. చౌక ధరలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షిస్తోంది.