Jio Cinema: రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ముందుగా అనుకున్నట్టుగానే జియో సినిమా యాప్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రకటించింది. ఇప్పటిదాకా వినియోగదారులకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్న జియో సినిమా తాజాగా పెయిడ్ ప్లాన్‌ను వెల్లడించింది. దేశీయ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ లాంటి ప్రత్యర్థులతో పోరాడేందుకు ఉచిత కంటెంట్ నుంచి తప్పుకుంది.
ఏడాది ప్లాన్ తో( Jio Cinema)
ఇక పై ఇతర ఓటీటీ మాదిరిగానే జియో సినిమా యాప్ సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని కోసం జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ 12 నెలలకు రూ. 999 గా నిర్ణయించింది. ఒక ప్లాన్ తో నాలుగు డివైజ్ ల్లో చూడవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవల ద్వారా HBO,మ్యాక్స్ ఒరిజినల్, Warner Bros ప్రత్యేకమైన కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి సంవత్సర ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే నెలవారీ ప్లాన్‌లు కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో సినిమా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంది.
10 కోట్ల కు పైగా యూజర్లు
ఇప్పటికే జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ కు అధికారిక లైవ్ స్ట్రీమింగ్ పార్టనర్ జియో సినిమా. ఇందుకు ముందు ఐపీఎల్ మ్యాచ్‌లు డిస్నీ హాట్‌స్టార్‌లోనే ప్రసారం అయ్యేవి. అయితే, ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షించడానికి హాట్ స్టార్ సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉండేది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని ప్లాట్‌పాం జియో సినిమా పేరుతో ఓటీటీలో కూడా దూసుకొచ్చింది. మొదట్లో టెలికాం సేవలను కూడా ఉచితంగా అందించిన జియో, ఆ తర్వాత పెయిడ్ సేవలను మొదలు పెట్టింది. అదే విధంగా జియో సినిమా తొలుత తన సేవలను ఉచితంగానే కస్టమర్లకు అందించింది. FIFA వరల్డ్ కప్ , IPL 2023 ని ఉచితంగా స్ట్రీమింగ్‌తో మరింత ఆదరణ లభించింది.