IPhone 14: కొన్ని రోజుల్లో ఐఫోన్ 15 విడుదల చేయనుంది యాపిల్ కంపెనీ. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 పై భారీగా ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటు విజయ్ సేల్స్ పోటీపడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికార వెబ్ సైట్ లో ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ. 79,900 గా ఉంది. అయితే క్రెడిట్, డెబిట్ కార్డులు, ఎక్సేంజ్ ఆఫర్స్ తో ఆయా సైట్లు ప్రత్యేక తగ్గింపులు అందిస్తుండగా ఐఫోన్ ధర రూ. 66 వేలకు వస్తోంది.
ప్లిప్ కార్ట్ లో..
ప్లిప్ కార్ట్ లో ఐఫోన్ 14 ( 128 జీబీ) వేరియంట్ పై అత్యధికంగా 12 శాతం తగ్గింపు ఇస్తోంది. దీంతో పాటు యాక్సస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ , హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డులపై 4 వేలు తగ్గింపును పొందొచ్చు. అదే విధంగా ఫ్లిప్ కార్ట్ ఎక్సేంజ్ ఆఫర్ అదనంగా వస్తోంది. అయితే పాత ఫోన్ కండీషన్ ను బట్టి గరిష్టంగా రూ. 29,250 వరకు లభిస్తుంది. దీంతో ఐఫోన్ 14 రూ. 40,749 కంటే తక్కువ ధరకే పొందొచ్చు.
అమెజాన్ లో..(IPhone 14)
అమెజాన్ లో ఐఫోన్14 పై 10 శాతం తగ్గింపుతో రూ. 71,999 లకు విక్రయిస్తున్నారు. అదే విధంగా పలు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 4 వేల వరకు ఆఫర్స్ కూడా అందిస్తోంది. అదనంగా
ట్రేడ్-ఇన్ ఆఫర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా అతి తక్కువ ధరకే ఐఫోన్ 14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ. 19,700 వరకు తగ్గింపు ఉంటుంది. దాంతో రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు.
యాపిల్ డేస్‌లో భాగంగా
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. విజయ్ సేల్స్ లో యాపిల్ డేస్‌లో భాగంగా కేవలం రూ. 70,999 లకే ఐఫోన్ 14 కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపు ఇస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లపై రూ. 4 వేల క్యాష్ బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2 వేల వరకు తక్షణ తగ్గింపు లాంటి ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది.